నేరస్తులకు సింహస్వప్నం…
1 min read
దర్యాప్తులో ఆధారాలను పక్కాగా పట్టించే అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం
మదనపల్లె, , న్యూస్ నేడు ప్రతినిధి : జిల్లాలో నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించేలా ఏపీ ఎఫ్.ఎస్.ఎల్. ద్వారా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంజూరు చేసిన అత్యాధునిక ‘మొబైల్ ఫోరెన్సిక్ వాహనం’ అన్నమయ్య జిల్లా కు చేరుకుంది. శుక్రవారం ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి లాంఛ నంగా ప్రారంభించి జిల్లా క్లూస్ టీమ్ ఇంచార్జి ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ బి. సునీల్ కి అప్ప గించారు. నేరస్థలం లో నిందితులు రక్తపు మరకలు, వేలి ముద్రలు తుడి చేసి సాక్ష్యాలు మాయం చేసినా ఇట్టే పసిగట్టేలా ఇందులో హై-ఇంటెన్సిటీ లైట్, డీఎన్ఏ తదితర 10 రకాల అత్యా ధునిక కిట్లు, మైక్రోస్కోప్ ఉన్నాయి. హిట్ అండ్ రన్, లైంగిక దాడులు, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, తుపాకీ కాల్పుల కేసుల్లో సైతం స్పాట్‌లోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించడానికి ఈ సాంకేతికత అద్భు తంగా పనిచేస్తుంది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మాట్లాడుతూ ఈ పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేస్తాం, నేరం చేసి తప్పించుకోవచ్చనే భ్రమలు ఇక వదిలేయాలని ఎస్పీ నేరస్తులను హెచ్చరించారు.


