గట్టులో రస్తాను పరిశీలించిన ఆర్డీవో
1 min read
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామ పొలిమేర అయినా గట్టును బుధవారం మధ్యాహ్నం ఆత్మకూరు ఆర్డీవో సి.వెంకట శివ పరిశీలించారు.ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామంలో ఉన్న క్రషర్ మిషన్ ఫ్యాక్టరీ నుండి కేతవరం గ్రామానికి వెళ్లడానికి రస్తా కావాలని కంపెనీ యాజమాన్యం జిల్లా అధికారులకు తెలపడంతో బన్నూరు పొలిమేర సర్వేనెంబర్-384 లో ఒక ఎకరా 40 సెంట్లు విస్తీర్ణం రస్తాకు వెళ్తుండడంతో రస్తా గురించి మిడుతూరు తహసిల్దార్ శ్రీనివాసులును మరియు గ్రామ సర్వేయర్ రాఘవేంద్రను ఆర్డీవో అడిగి తెలుసుకున్నారు.ఈ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆర్డీవో తెలిపారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో సోఫి సాహెబ్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.



