ప్రకృతి వ్యవ సాయంలో గుండ్లపల్లి రైతులు ఆదర్శం
1 min read
ప్రోత్సహిస్తున్న ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది : తంబళ్లపల్లె మండలం లో గుండ్లపల్లి రైతులు పోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విదానాన్ని అవలం భిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో డైరెక్టర్ జల్లా లలితమ్మ రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై విస్తృత అవగాహన కల్పిస్తూ ప్రోత్స హిస్తున్నారు.ఇందులో భాగంగా బుధవారం జల్లా లలితమ్మ స్థానిక రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల సాగు పద్ధతులను పరిశీలించారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం తో పోర్డ్ సంస్థ ఏటీఎం మోడల్‌లో 18 రకాల ఆకుకూరలు, కాయగూరలు, పండించేలా 10 మంది రైతులను ఎంపిక చేసి వారికి విత్తనాలను అందించి ప్రోత్స హిస్తోంది. ఎంపిక చేసిన రైతులతో విత్తనాలు విత్తించడం పూర్తయిందని లలితమ్మ తెలిపారు. ఏపీ సీఎన్ఎఫ్ సాంకే తిక సహకారంతో గుండ్లపల్లి రైతులు ప్రకృతి వ్యవ సాయం లో ఆదర్శంగా నిలుస్తు సాటి రైతులను, ప్రకృతి ప్రేమికుల ను, వినియోగ దారులను ఆకట్టు కుంటున్నారు.ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా తక్కువ ఖర్చు, తక్కువ సాగు నీటితో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తూ, ఆరోగ్య కరమైన వ్యవ సాయ ఉత్పత్తు లను ప్రజలకు అందించేందుకు రైతులు కృషి చేస్తున్నారని లలితమ్మ తెలిపారు. ఈ విధానం ద్వారా మరింత మంది రైతులకు ఆదర్శం గా నిలుస్తూ వ్యవ సాయంలో నూతన మార్గానికి గుండ్ల పల్లి రైతులు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.



