రాష్ట్రవ్యాప్తంగా రజకుల సేవలను ప్రభుత్వం గుర్తించాలి
1 min read
50 ఏళ్ళు నిండిన రజకు లకు పెన్షన్ మంజూరు చేయాలి
టిడిపికి పూర్తి స్థాయిలో రజకుల మద్దతు ఆదుకోవాలని
ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతి
టిడిపి బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు నాగయ్య
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది : రాష్ట్రవ్యాప్తంగా రజకులు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించా లని మదనపల్లె నియోజకవర్గం టిడిపి బిసి సెల్ అధ్యక్షులు, రజక సంఘాల రాష్ట్ర నాయకులు ముసలి కుంట నాగయ్య విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి లో ముసలి కుంట నాగయ్య ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి రజక సాధికార కమిటీ సభ్యులు ముది మడుగు రామ్మూర్తి తో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ముసలి కుంట నాగయ్య మాట్లా డుతూ రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన రజకులకు ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. టిడిపి ఆవిర్భావం నుండి పూర్తి స్థాయి లో రజకుల మద్దతు తెలుగు దేశం పార్టీ వైపే ఉందని గుర్తు చేశారు. వృత్తి పరంగా రజకులు మురికిని శుభ్రం చేయడానికె, పరి మితమై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని, డప్పు, చేనేత, మత్స్య కారులకు ప్రభుత్వం 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్న విధంగా రజకులకు కూడా ఈ విధానాన్ని వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. మంచి చేయటం మాత్రమే రజకులకు తెలుసునని, చెడు చేయడం రజకుల కు ఎవ్వరికి అల వాటు లేదని పేర్కొన్నారు. ఈనేప థ్యం లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక కుటుంబాలను అభివృద్ధి పథంలోకి నడిపించడానికి ప్రత్యేక చొరవ చూపాలని ముఖ్య మంత్రిని అభ్యర్థిం చామన్నారు.రాష్ట్రం లో 16 లక్షల పైగా ఓటర్లు ఉండగా, మదనపల్లె నియోజక వర్గం లో 18 వేల మందికి పైగా రజక ఓటర్లు ఉన్నారని వివ రించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ను రజకులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి అత్యధిక సీట్లు సాధించడానికి మద్దతు ఇస్తారని తెలిపారు. మదన పల్లె నియోజకవర్గం లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో రజకులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతు న్నాయని మరింత అభివృద్ధి సాధించేందుకు సహకరించాలని కోరారు.


