NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గర్భవతులకు ,బాలింతలకు వ్యాధినిరోధక టీకాలపై  అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఇందిరాగాంధీ నగర్​ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలోని  113 వ  సచివాలయంలో తల్లులకు, గర్భవతులకు  వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాములో డెమో ప్రకాష్ రాజ్  పాల్గొన్నారు.అనంతరం గర్భవతులకు ,బాలింతలకు వ్యాధినిరోధక టీకాలపై  అవగాహనకల్పించినారు. గర్భంలో ఉన్న మహిళకు రూబెల్లా  సోకితే ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని దీని మూలంగా పుట్టబోయే బిడ్డకు కంటి లోపాలు, వినికిడి లోపం, మెదడు మరియు గుండె సంబంధిత లోపాలు కలుగుతాయని, కొన్ని సందర్భాల్లో గర్భస్రవం,మృత శిశువు జన్మించాడం జరుగుతుందని తెలిపారు. తట్టు ఒక ప్రాణంతక వ్యాధి, దీని కారణంగా చిన్నారుల్లో న్యూమోనియా కు గురవుతారు,,. మిజిల్స్ రుబెల్ల ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే 9 నుండి 12 నెలల  వయస్సులో  చిన్నారులకు మొదటి  డోస్-1,16 నుంచి  24 నెలలల  వయస్సులో ఉన్నవారికి   రెండో డోస్-2 తప్పనిసరిగా వేయించుకోవాలని ఈ వ్యాక్సిన్ వేయడము వలన చిన్నారుల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో వారికి తట్టు రాకుండా ఉంటుందని తెలిపారు. గర్భిణిలకు రెండు టిడి డోసు వ్యాక్సిన్ తో పాటు ఐరన్ మాత్రలు ఇవ్వాలని  సిబ్బందికి  సూచించినారు.ఈ కార్యక్రమములో   డిప్యూటీ హెల్త్ ఏడ్యూకేషన్ ఆఫీసర్ పద్మావతి ,సచివాలయ ఆరోగ్య కార్యకర్త   శివ జ్యోతి, రాజ్యలక్ష్మి ,ప్రశాంతి, సరోజ ఆశా కార్యకర్తలు మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *