పెద్దహ్యాట బీసీ కాలనీలో ప్రధాన రహదారికి గ్రావెల్ ఏర్పాటు
1 min read
వర్షం వస్తే మోకాళ్ల లోతు నీరు.. ప్రజలు, వాహనదారుల ఇబ్బందులకు పరిష్కారం
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండలంలోని పెద్దహ్యాట గ్రామ బీసీ కాలనీలో ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రటరీ రాజ్‌కుమార్, టీడీపీ యువ నాయకులు బీజీ హళ్లి వీరేంద్ర, పెద్దహ్యాట బీకే వీరేష్ ఆధ్వర్యంలో రహదారికి గ్రావెల్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు మాట్లాడుతూ.. పెద్దహ్యాట గ్రామంలోని ప్రధాన రహదారిపై వర్షాలు కురిసిన సమయంలో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేదన్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.సమస్యను తెలుసుకున్న వైకుంఠం జ్యోతి వెంటనే అధికారులతో మాట్లాడి రహదారి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు. దీంతో రహదారిపై గ్రావెల్ ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.రహదారి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ చూపిన ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి, పంచాయతీ అధికారులకు, టీడీపీ నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


