NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు చెల్లించిన పంటల బీమా (ఇన్సూరెన్స్)కు అనుగుణంగా పంట నమోదు చేయాలి

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులు చెల్లించిన పంటల బీమా కు అనుగుణంగా పంటల నమోదు చేయాలని లేదా గ్రామంలోని మొత్తం విస్తీర్ణంలో పంట నష్ట నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం – హోసూరు గ్రామ కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దాయి గౌడ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వ్యవసాయ అధికారికి విజ్ఞప్తి చేశారు.కర్నూలు జిల్లా, పత్తికొండ మండలంలోని హోసూరు గ్రామం మండలంలో ఎక్కువ రెవెన్యూ విస్తీర్ణం కలిగిన గ్రామాలలో ఒకటి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు మరియు తీవ్రమైన ఎండల ప్రభావం కారణంగా రైతులు వేసిన పంటలు ప్రారంభ దశలోనే మొలకెత్తిన అనంతరం తీవ్ర ఎండలకు గురై మొలకలు నశించాయినీ ఆయన తెలిపారు.దీంతో రైతులు పూర్తిస్థాయిలో పొలాల్లో పెట్టుబడులు పెట్టి తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. బోర్ల కింద, కాలువల కింద నీటి సౌకర్యం ఉన్న రైతులు సాగు చేసుకుంటున్న పంటలు మాత్రమే కొంతమేర కనిపిస్తున్నాయి. అయితే వర్షాధార (బయలు) పొలాల్లో సాగు చేస్తున్న రైతులందరూ తీవ్ర స్థాయిలో నష్టపోయారు అని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-క్రాప్ పంట నమోదు ప్రక్రియను గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకుల ద్వారా నిర్వహిస్తున్నందున, రైతులు పంటల కోసం చెల్లించిన ఇన్సూరెన్స్ వివరాలను పరిగణనలోకి తీసుకొని, వాస్తవంగా సాగు చేసిన పంటలకు అనుగుణంగా అర్హత ఉన్న రైతులందరికీ పంట నమోదు చేయవలసిందిగా కోరుతున్నాముఇన్సూరెన్స్ కట్టిన విధంగానే అర్హత ఉన్న రైతులందరికీ పంట నమోదు చేయాలి. లేనిపక్షంలో హోసూరు గ్రామంలో మెజారిటీ రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టం మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *