NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అశోకా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ‘UDAAN 2026’ ఓరియంటేషన్ కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : కర్నూలులోని అశోకా మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థినుల కోసం ‘UDAAN 2026’ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన విద్యార్థినులకు కళాశాల విద్యా విధానం, పరీక్షల ప్రక్రియ, నియమ నిబంధనలు, ప్లేస్‌మెంట్ అవకాశాలు, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సర్వీస్‌నౌ, హైదరాబాద్ HR లీడర్ శ్రీ గోకులకన్నన్ నరసింహన్, పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హైదరాబాద్ TA లీడర్ శ్రీ జి. వినయ్ శ్రీకాంత్, TCS, హైదరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ , బి. సాయి లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.శ్రీ గోకులకన్నన్ నరసింహన్ మాట్లాడుతూ, అశోకా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే 100 శాతం అడ్మిషన్లు పూర్తికావడంఅభినందనీయమని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కళాశాలపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. నూతన విద్యార్థినులు కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా, సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని అతిథులు సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. నవీన్ విద్యార్థినులకు పరీక్షల నిర్వహణ విధానం, అంతర్గత మూల్యాంకనం, హాజరు, అకడమిక్ ప్రక్రియలను వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్ కళాశాలలో పాటించాల్సిన నియమ నిబంధనలు, క్రమశిక్షణ, సమయపాలన, విద్యార్థుల బాధ్యతలను వివరించారు.నూతన విద్యార్థినులకు ఉత్సాహభరితమైన ప్రారంభాన్ని అందించిన UDAAN 2026 ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *