దోమల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతోనే నిర్మూలించగలం
1 min read
దోమల నిర్మూలించడం ద్వారా డెంగ్యూ రహిత సమాజం స్థాపించుకో వచ్చు
ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్: యు.శోభ
ఇజ్రాయిల్ పేటలో ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దోమల నిర్మూల ప్రజల భాగస్వామ్య తోనే నిర్ములించగలమని,దోమల నిర్మూలించడం ద్వారా డెంగ్యూ రహిత సమాజం స్థాపించుకోవచ్చని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యు. శోభ సూచించారు. స్థానిక ఏలూరు లంకపేట ఇజ్రాయిల్ పేట లో జరుగుచున్న ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ప్రజలతో మాట్లాడుతూమాట్లాడుతూ వర్షాకాలంలో సాధారణంగా దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందని మంచినీటి నిల్వ ప్రాంతాలలో డెంగ్యూ దోమ, మలేరియా దోమ వృద్ధి చెందుతాయని, మురుగునీరులో క్యూలెక్స్ దోమ వృద్ధి చెందుతారని మలేరియా జ్వరాలు ప్రాంతంలోనూ, డెంగు జ్వరాలు సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో సంభవిస్తాయని డెంగ్యూ జ్వరము సాధారణమైన జ్వరం అని అశ్రద్ధ చేస్తే డెంగు జ్వరం ప్రాణాపాయమని, డెంగ్యూ దోమ పగటపూట కుడుతుందని డెంగు కారక దోమ ఎడీస్ అనే పులి దోమ మంచినీటి నిల్వ ప్రాంతాలలైన మూతలు లేని నీళ్ల తొట్టెలు, డ్రమ్ములు,పూల కుండీలు, నీటి బావులు,పంచినీటి నిల్వ ప్రాంతాలు,ఎయిర్ కూలర్స్ ఫ్రిడ్జ్ వెనక బాక్సు టైర్లు వాడేసిన కొబ్బరి బొండాలు ప్లాస్టిక్ వస్తువులు పగిలిపోయిన కుండలు తదిత ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఇంటి లోపల ఇంటి బయట ఫ్రైడే డ్రై డే పాటించాలని పనికిరాని వస్తువులు విసర్జించాలని నీటి నిల్వ ప్రాంతాలపై మూతలు పెట్టుకోవాలని డెంగ్యూ దోమ పగటిపూట కుడుతుంది కాబట్టి దోమ కాటు నుండి మనం సంరక్షించుకోవాలని జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ఏలూరు జిల్లాలో డెంగ్యూ జ్వరాలు కమీణా తగ్గుతున్నాయని దీనికి కారణం ప్రజల్లో అవగాహన రావడం వల్లనే అని సూచించారు అనంతరం ఇంటింటికి వెళ్లి డ్రమ్ములు ఫ్రిజ్లు ఇతర నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించి కరపత్రాలు పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు, అనంతరం అంగన్వాడి కేంద్రం 16 సందర్చించి ప్రీస్కూల్ పిల్లలు కి ఆరోగ్య సూత్రాలు వివరించారు ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్:బిబి జాన్ అసిస్టెంట్ మలేరియా అధికారి జె. గోవిందరావు,పందిరి శ్రీనివాసరావు,మెల్ హెల్త్ అసిస్టెంట్స్ ,మేక శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్,రమేష్ బాబు , ఆరోగ్య కార్యకర్తలు ఆశ కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.


