ఎల్లార్తి దర్గాను దర్శించిన ఎంపీడీవో
1 min read
గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో సుప్రసిద్ధ హజరత్ ఫాషావలి, షాక్షావలి తాత దర్గాను మండల ఎంపీడీవో ఉమర్ మహమ్మద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గ్రామ ప్రజల సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థించారు.అనంతరం గ్రామస్తులు ఎల్లార్తిలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో ఉమర్ మహమ్మద్ సమస్యలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లార్తి పంచాయతీ సెక్రటరీ నాగరాజ్, టీడీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, మహబూబ్ బాషా, జె.పీ. రాముడు, షఫీకాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


