ఎమ్మెల్యే గ్రీవెన్స్ కు 14 అర్జీలు…
1 min read
నూతన బోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..
మిడుతూరు న్యూస్ నేడు: ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులను హెచ్చరించారు.నంద్యాల జిల్లా మిడుతూరు సచివాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన’ప్రజా ఫిర్యాదుల స్వీకరణ’లో భాగంగా ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు.ప్రజల నుండి 14 అర్జీలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి.కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దని వారి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏ లతో కలిసి సీపీఎం నాయకులు కర్ణ,ఓబులేష్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఆస్పత్రిలో నూతన బోర్ ప్రారంభం
మిడుతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట నూతనంగా వేసిన త్రాగునీటి బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు.తర్వాత ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కాంట్రాక్టు వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని వారు వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయి సుధా మరియు సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు, మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,డిప్యూటీ ఎంపీడీవోలు సంజన్న, సురేష్ కుమార్ మరియు నాయకులు వంగాల శివరామిరెడ్డి,సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



