NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జోహారాపురము లో సయ్యద్ అల్లాబకష్ వలి ఉరుసు..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగర సమీపం లోని జోహారాపురం లో ఈ నెల 21-09–2026 సోమవారం గంధము,22-09-2026 మంగళవారం ఉరుసు (తట్టీలు ), 23-09-2026 బుధవారం కిస్తీలు (జియారత్ )ఉరుసు మహోత్సవం జరుగుతుందని దర్గా ముత్తవలి(నిర్వాహకులు )సయ్యద్ అల్లాఉద్దీన్ షరీఫ్ పాషా తెలిపారు.ఈ సందర్బంగా నిర్వాహకులు సయ్యద్ అల్లా ఉద్దీన్ షరీఫ్ పాషా మాట్లాడుతూ జోహారాపురము గ్రామం లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి మతసామరస్యానికి ప్రతీకగా 3 రోజులు గా ఉరుసు మహోత్సవం జరుపు కుంటారని, ఈ ఉరుసు కు జిల్లా నలుమూలలనుండి భక్తులు హాజరు అవుతారని చెప్పారు. గత 373 సంవత్సరాల నుండి ఈ ఉరుసు మహోత్సవం జరుగుతుందని, కావున భక్తులందరు ఉరుసు మహోత్సవం నకు హాజరై సయ్యద్ అల్లాబకష్ వలి  దయకు పాత్రులై, ప్రసాదం స్వీకరించి, జయప్రదం చేయవలెనని కోరారు.ఈ ఉరుసు సందర్బంగా దర్గాను రంగురంగుల విద్యుత్ బల్బులతో  సుందరంగా అలంకరించారని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *