అమ్మచెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
1 min read
రెండు దశాబ్దాల తరువాత చెరువు కు జలకళ
వేగంగా ముళ్ళు పొదలు తొలగించే పనులు
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె పట్టణం లోని అమ్మచెరువు కు కృష్ణా జలాలు మోటార్లు తో తరలింపు ప్రక్రియ నిర్విఘ్నంగా సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక కూటమి నాయకుల తో చెరువు లో కొనసాగుతున్న ముళ్ళ చెట్లు తొలగింపు పనుల ను క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే యం. షాజహాన్ భాష పరిశీలించారు.అదే విధంగా చెరువు లొకి చేరుతున్న నీరు, చెరువు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగు పడేందుకు పట్టే సమయం పైన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషామాట్లాడుతూ అమ్మచెరువు నింపు తామని మాట ఇచ్చాను, ఆ మాటకు కట్టుబడి అమ్మచెరువులోకి కృష్ణా జలాలను చర్చా మన్నారు. నీళ్లు నింపడంతో పాటు ముళ్ళ చెట్లను తొలగిస్తు న్నామన్నారు. నిధులు లేక పోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో దాదాపు 90 కి పైగా చెరువులను నీటితో నింపుతామని తెలిపారు.


