పంటలు నష్టపోకుండా రైతులు.. వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలి
1 min read
భారీవర్షాలు కారణంగా క్షేత్రస్థాయిలో వరిపొలాలను పరిశీలన
పకృతి వ్యవసాయం వైపు ప్రతి రైతు అడుగులు వెయ్యాలి
వరిపొలాల్లోకి స్వయంగా వెళ్ళి పరిశీలించి, రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కామవరపుకోట, కామవరపుకోట మండలం కామవరపుకోట, పాతూరు, రావికంపాడు (శ్రీనాగ దుర్గా అమ్మవారు స్వామివారి ఆలయం దగ్గర), తదితర ప్రాంతాల్లో గురువారం వరి పోలాలను పరిశీలించి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి రైతులతో మాట్లాడి పంటలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోకుండా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. పకృతి వ్యవసాయం వైపు ప్రతి రైతు అడుగులు వెయ్యాలని, అందుకు అనుగుణంగా వ్యవసాయ ఆధునిక పద్ధతులు, మార్కెటింగు, తదితర సౌకర్యాలు మీ చెంతకే అధికారులు వచ్చి పూర్తి సహకారం అందిస్తారని అన్నారు. యూరియా, డిఏపి సక్రమంగా అందుతుందా అని అడగగా, బాగానే అందుతుందని, మా ప్రాంతం పొలాలు బాగున్నాయని రైతులు చెప్పడంతో జిల్లా కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ భారీ వర్షాలతో కారణంగా వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని, వరి పంటలు బాగానే ఉన్నాయని రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా నమోదైన వర్షాలు కారణంగా వరి, వివిధ రకాలు పంటలుపై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. ప్రస్తుతం సార్వా సీజన్లో వరి పంటలు వేయకుండా మిగిలి పోయిన భూములలో వరికి బదులుగా అపరాలు మినుములు, పెసర వంటి పంటలు సాగు చెయ్యాలని విత్తనాలు 80 శాతం రాయితీ మీద సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరి పంట సాగు చేయు రైతులు వరి రకాలను మార్పు చేసుకొని ఎక్కువ దిగుబడి నిచ్చే రకాలను సాగు చెయ్యాలని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తుకు భరోసా
వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవ డానికి రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెరగడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పంట నష్టం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకర మైన గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత రైతులుగా మీపై ఉందని అన్నారు. గ్రామీణ స్థాయిలో రైతులకు ప్రకృతి సేద్యంపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలు యధాస్థితికి వచ్చేంతవరకు వ్యవసాయ అనుబంధ శాఖలు క్షేత్రస్థాయిలో వివిధ రకాలు పంటలను అధ్యయనం చెయ్యాలని అధికారులకు జిల్లా కలెక్టరు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడీ యస్.కె.హభీబ్ భాషా, డిపియం బి.వెంకటేష్, తహశీల్దారు జి.ఎలీషా, వ్యవసాయ అనుబంధ, వివిధ అనుబంధ శాఖలు అధికారులు,వ్యవసాయ, రెవెన్యూ, స్వర్ణగ్రామ, రైతుసేవా కేంద్రం సిబ్బంది, స్థానిక నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


