NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీ కేంద్రాలు శుభ్రంగా ఉంచాలి

1 min read

మండల స్పెషల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్..

మిడుతూరు న్యూస్ నేడు: ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రంగా ఉండాలని మిడుతూరు మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్ జాకీర్ హుస్సేన్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం’పోషణ మాసోత్సవ’ కార్యక్రమం అంగన్వాడి సూపర్వైజర్ రేణుకా దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పెషల్ ఆఫీసర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ రేణుకా దేవి మాట్లాడుతూభోజనంలో ఐదు రకాల థీమ్స్ ఇవ్వటం జరిగింది ఇందులో భాగంగా మన అంగన్వాడి మన బాధ్యత అనేది పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి వివరించారు. స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ అంగన్ వాడిలో పిల్లలకు మంచిగా పౌష్టికాహారం ఇవ్వాలని ప్రీస్కూల్ హాజరు మెరుగుపరచాలన్నారు.మనం తినే ఆహారం కలర్ ఫుల్ ప్లేట్ ఎలా ఉండాలనే దాని గురించి వివరించారు   ఆడపిల్లలకు బాల్య వివాహాలు జరగకుండా గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఎంపీడీవో దశరథ రామయ్య అన్నారు. గర్భవతులు బాలింతలకు పౌష్టికాహార సేవలు మంచిగా అందించాలని అదేవిధంగా గర్బవతులు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ సాయి సుధా వివరించారు. చెప్పారు.బేటి బచావో బేటి పడావో వాటి గురించి 1000 రోజుల సంరక్షణ పోషకాహారం పిఎంఎంవివై గురించి తెలిపారు.అంగన్వాడీ కేంద్రాల్లో 25 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అదేవిధంగా అంగన్వాడి ఎస్ఎంసి కమిటీల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంఈఓ ఫైజున్నిసా బేగం మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *