NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా కలెక్టరు అధ్యక్షతన కలెక్టరేటులో (నార్కో)కో-ఆర్డినేషన్ ) మీటింగ్ నిర్వహణ

1 min read

హాజరైన వివిధ శాఖల జిల్లా అధికారులు

ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ బుధవారం గత NCORD సమావేశం 31 నుండి 23 వరకు జిల్లాలో జరిగిన ముఖ్యమైన నార్కోటిక్ సంబంధిత కార్యకలాపాలు, కేసులు, అవగాహన కార్యక్రమాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలను జిల్లా అధికారులకు వివరించారు.అనంతరం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి  ఈ నెలలో చేపట్టాల్సిన డ్రగ్స్ కంట్రోల్ మరియు డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలపై వివిధ శాఖల పాత్రను వివరించి, ముఖ్యంగా విద్యార్థుల్లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సమావేశంలో ముఖ్యమైన ఆదేశాలుఅబండోనెద్ బిల్డింగ్స్  వాడుకలో లేని భవనాలు మరియు డ్రగ్స్‌కు సంబంధించిన హాట్‌స్పాట్స్ వద్ద ఉన్న చెట్లు, పొదలను తొలగించి, అవసరమైన ప్రాంతాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.LEAAP App ద్వారా వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.ముఖ్యమైన మరియు అవసరమైన పాఠశాలల్లో డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాల నిర్వహణకు పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు EAGLE Cell‌ను సంప్రదించి కార్యక్రమాలు చేపట్టాలని DEO, Eluru వారికి సూచించారు. ఈ సమావేశంలో ఉప రవాణా కమీషనరు యస్.కె.కరీం, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి.వి.జి. మల్లిఖార్జున రావు, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, జిల్లా ప్రజా రవాణాధికారి యస్.కె.షబ్నమ్, డియస్పి శ్రావణ్ కుమార్,జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి. శేఖరు, విభిన్న ప్రతిభావంతులు శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్,ఈగిల్ టీమ్ ఇంచార్చి బి.ఉదయ భాస్కర్, పోలీసు అధికారులు, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *