NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కే.ఈ. శ్యాం కుమార్

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ : పత్తికొండ మండలం నలకదొడ్డి గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే కేఈ,శ్యామ్ కుమార్,టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్‌నాథ్ చేతుల మీదుగా గ్రామ టిడిపి అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్యం తదితర కారణాలతో చికిత్స పొందిన లబ్ధిదారులకు మంజూరైన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యే కెఈ.శ్యాంకుమార్,కు బత్తిని బ్రదర్స్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు, లబ్ధిదారుల తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *