NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి

1 min read

… సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య

న్యూస్ నేడు, పత్తికొండ: కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సిపిఐ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం పత్తికొండలో 3,5,6 వ వార్డు సచివాలయాలలో మండలంలోని. పందికోన. పులికొండ.,దూదేకొండ కోతిరాళ్ల . చిన్నహుల్తి. జూటూరు. నలకదొడ్డి, చక్రాళ్ళ గ్రామ సచివాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, ఆయా శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావంతో సరైన వర్షాలు కురవక రైతులు సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కర్నూలు జిల్లా ను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని, పంట పెట్టుబడికి రైతులు బ్యాంకులలో తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరువు బారిన పడిన ప్రతి కుటుంబానికి నెలకు 20వేల రూపాయలు 8 నెలల పాటు ఆర్థిక సహాయం అందించాలన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా 15 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు కల్పించి వలసలను నివారించి రోజుకి కనీస వేతనం 700 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కరించి, పశువులకు పశుగ్రాసం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజా సాహెబ్, మండల కార్యదర్శి యు. కారుమంచి, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *