NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా కలెక్టర్​ అధికారులకు ఆదేశాలు జారీ

1 min read

ప్రజలు వాగులను దాటకుండా ముందస్తు జాగ్రత్తగా బారికేడ్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో  భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో  ప్రజలు వాగులను దాటకుండా ముందస్తు జాగ్రత్తగా బారికేడ్ లను  ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.  జిల్లాలో వరద ముందస్తు జాగ్రత్త చర్యలపై అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వరదల సమయంలో వాగులు, తమ్మిలేరు, బుడమేరు వంటి ఏర్లు పొంగి ప్రవహించే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఆకస్మిక వరద ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున  ప్రజలు వాగులు, కాజ్ వే  లు  దాటకుండా  అప్రమత్తం చేసేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలాల పరిధిలో తహసీల్దార్లు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవించకుండా  చర్యలు తీసుకోవాలన్నారు.  వరదల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.   భారీ వర్షాల నేపథ్యంలో పట్టణాలు, గ్రామాలలోని కాలువలు, డ్రైన్లలో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా  చర్యలు తీసుకోవాలన్నారు.  చెట్లు కూలిన ప్రదేశాలలో  రవాణా వ్యవస్థకు ఎటువంటి ఆటంకం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మండల, డివిజన్ కేంద్రాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని, కంట్రోల్ రూమ్ లకు వచ్చే  ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు తెలియజేసి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.   వరద సమయంలో ఎవరూ నదులు, కాల్వలు, జలాశయాలలోనికి వెళ్లకుండా చూసేలా  ఆయా ప్రదేశాలలో సిబ్బందిని నియమించాలన్నారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *