NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండల స్పెషల్ ఆఫీసర్ గా జాకీర్ హుస్సేన్

1 min read

నిన్నటి నుండి ప్రత్యేక అధికారుల పాలన

బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఆఫీసర్లు..

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల ప్రత్యేక అధికారిగా ఎస్ జాకీర్ హుస్సేన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.2021 సెప్టెంబర్ నుండి జడ్పిటిసి,ఎంపిటిసిల ఐదేళ్ల పదవీకాలం 2026 సెప్టెంబర్ 23 తో స్థానిక ప్రజా ప్రతినిధుల పాలన గురువారం నిన్నటితో ముగియడంతో నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఉత్తర్వుల మేరకు నిన్నటి నుండి మండలంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.బాధ్యతలు చేపట్టిన మిడుతూరు స్పెషల్ ఆఫీసర్ కు ఎంపీడీవో దశరథ రామయ్య,డిప్యూటీ ఎంపీడీవో లు సంజన్న, సురేష్ కుమార్,ఏవో సురేష్ కుమార్ మరియు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నందికొట్కూరు మండల స్పెషల్ ఆఫీసర్ గా వరప్రసాద్,జూపాడుబంగ్లా మండల స్పెషల్ ఆఫీసర్ గా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామాంజనేయ నాయక్, పగిడ్యాల మండల స్పెషల్ ఆఫీసర్ గా సెరి కల్చర్ డిప్యూటీ డైరెక్టర్ నాగేష్బాధ్యతలు స్వీకరించారు. అధికారులకు ఆయా కార్యాలయాల అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *