శ్రీ సరస్వతీ శిశు మందిరంలో ఘనంగా వందేమాతరం సామూహిక గీతాలాపన
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: శ్రీ సరస్వతీ శిశు మందిరంలో వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం పాఠశాల అధ్యక్షులు యాడికి పార్థసారథి, కార్యదర్శి బీసీ విజయకుమార్ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథి సుబ్రహ్మణ్యం వందేమాతరం ప్రాముఖ్యతను వివరించారు. అధ్యక్ష ప్రసంగంలో బీసీ విజయకుమార్ బంకిమ్ చంద్ర చటర్జీ గురించి వివరించారు.ప్రధాన వక్తగా ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు నవీన్ వందేమాతరం ఉద్యమ విశేషాలను వివరించారు. పాఠశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దేవి దయానంద్ సింగ్ కూడా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో సమితి వైస్ ప్రెసిడెంట్ కేసి రామాంజనేయులు, ప్రబంధ సమితి సభ్యులు తనుషా, శాంతి, పాఠశాల ఆచార్యులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



