డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో ఐదు రోజుల బ్యాంకింగ్ అవసరం
1 min read
ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి – Work-Life Balance, ఉద్యోగుల సంక్షేమం, మెరుగైన కస్టమర్ సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలి
అనిల్ రెడ్డి, యూత్ కౌన్సిల్ మెంబర్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్
కర్నూలు, న్యూస్ నేడు: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఉద్యోగుల పని విధానంలో మాత్రం తగిన మార్పులు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూత్ కౌన్సిల్ మెంబర్ అనిల్ రెడ్డి పేర్కొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు రోజుల బ్యాంకింగ్‌ను అమలు చేసి, ఉద్యోగుల Work-Life Balance, సంక్షేమం మరియు మెరుగైన కస్టమర్ సేవలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.గతంలో బ్యాంకింగ్ ప్రధానంగా శాఖలకు వచ్చే ఖాతాదారులకు సేవలు అందించే విధానంలో ఉండేది. అయితే నేడు Internet Banking, Mobile Banking, UPI, ATMలు, Digital Lending, Video KYC, Centralised Processing Centres, Artificial Intelligence (AI), Automation వంటి సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణతో బ్యాంకింగ్ సేవలు 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ అందుబాటులోకి వచ్చాయి.
1,100 రోజులు గడిచినా 5 రోజుల బ్యాంకింగ్ అమలు కాలేదు
ఐదు రోజుల బ్యాంకింగ్‌ను కేవలం రెండు రోజుల సెలవుల కోసం చేసే డిమాండ్‌గా చూడకూడదని అనిల్ రెడ్డి అన్నారు. ఉద్యోగులకు సరైన విశ్రాంతి, కుటుంబంతో గడిపే సమయం లభిస్తే వారు మరింత ఉత్సాహంతో, ఏకాగ్రతతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఉద్యోగుల సంక్షేమం మరియు సంస్థ ఉత్పాదకత పరస్పర విరుద్ధమైన అంశాలు కావని, సరైన Work-Life Balance ఉద్యోగుల పనితీరుకు కూడా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
UFBU–IBA చర్చల్లో 5 రోజుల బ్యాంకింగ్ ప్రధాన అంశం
ఐదు రోజుల బ్యాంకింగ్ డిమాండ్ కొత్తది కాదని, గత అనేక సంవత్సరాలుగా UFBU ఈ అంశాన్ని IBAతో జరిగిన చర్చల్లో నిరంతరం ప్రస్తావిస్తోందని అనిల్ రెడ్డి తెలిపారు. 2026లో కూడా ఈ అంశం ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లలో ఒకటిగా కొనసాగుతోందన్నారు.“ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే పరిస్థితి రాకూడదు” “బ్యాంకింగ్ సేవలు డిజిటల్‌గా 24×7 అందుబాటులో ఉన్న యుగంలో, ఉద్యోగుల పని విధానం కూడా ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి. ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా 5 రోజుల బ్యాంకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1,100 రోజులకు పైగా గడిచిన నేపథ్యంలో ఈ అంశాన్ని ఇంకా వాయిదా వేయడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతుంది.” “ఉద్యోగులపై ఒత్తిడి పెంచడం కంటే వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం, IBA, బ్యాంకు యాజమాన్యాలు మరియు ఉద్యోగ సంఘాలు చర్చలు జరపాలి. 5 రోజుల బ్యాంకింగ్ అమలు కోసం ఉద్యోగుల ఉద్యమం కొనసాగుతుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ అయిన 5 రోజుల బ్యాంకింగ్ సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని అనిల్ రెడ్డి యూత్ కౌన్సిల్ మెంబర్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (APTBEF) స్పష్టం చేశారు.


