ఎవరూ లేని అభాగ్యుడికి అండగా స్ఫూర్తి సేవా సమితి
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ రైల్వే స్టేషన్లో తలదాచుకుంటూ జీవిస్తున్న ఓ నిస్సహాయ వృద్ధుడికి స్ఫూర్తి సేవా సమితి సభ్యులు అండగా నిలిచారు. తీవ్ర గాయంతో, పురుగులు పట్టిన చేతితో రోడ్డు పక్కన దీనస్థితిలో ఉన్న వృద్ధుడిని గమనించిన సమితి సభ్యులు వెంటనే స్పందించారు.వృద్ధుడికి దగ్గరుండి సపర్యలు చేసి, గాయాన్ని శుభ్రం చేసి పురుగులను తొలగించారు. అనంతరం ఆసుపత్రికి తరలించి వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్స అందించారు. కొత్త బట్టలు, ఆహారం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.అభాగ్యుడికి అండగా నిలిచిన స్ఫూర్తి సేవా సమితి సభ్యులను స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో స్ఫూర్తి మధు, భాస్కర్, శివయ్య, ఆటో చిన్న, అంబులెన్స్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.



