పదవ రోజుకు చేరిన వీఆర్ఎల దీక్ష
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఎలు) చేపట్టిన దీక్ష శుక్రవారం నాటికి పదవ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వారు దీక్ష కొనసాగిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం జరిగే వరకు ఆందోళనను కొనసాగిస్తామని వీఆర్ఎలు స్పష్టం చేశారు. ఈ దీక్షలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు ఓబులేసు, రామనాయుడు, నబీ రసూల్, టి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


