ఎన్నికల విధులకు సన్నధ్దం కావాలి… నిష్పక్షపాతంగా పని చేయాలి
1 min read
శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యం…
పోలీసు అధికారుల నేర సమీక్షా సమావేశం ….
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ‘ఆపరేషన్ త్రిశూల్’ పటిష్టంగా అమలు చేయాలి.
స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా 60 నుంచి 90 రోజుల్లోగా కేసుల దర్యాప్తు పూర్తి కావాలి.
నేర పరిశోధనకు అత్యాధునిక సాంకేతికత … జిల్లాలోని 43 పోలీస్ స్టేషన్లకు సరికొత్త ఫింగర్‌ప్రింట్ పరికరాల పంపిణీ.
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు సాంకేతిక ఆధారిత సేవల పై పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల కట్టడికి ప్రత్యేకంగా ‘ఆపరేషన్ త్రిశూల్’ను గట్టిగా అమలు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాలన్నారు: మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద వైట్ లైన్స్, ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు .నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను జోడించేందుకు ఐసీజేఎస్ (ICJS) ప్రాజెక్ట్ కింద జిల్లాలోని 43 పోలీస్ స్టేషన్లకు ఎస్పీ చేతుల మీదుగా ప్రత్యేక పరికరాలను పంపిణీ చేశారు.ఫింగర్‌ప్రింట్ ఎన్రోల్మెంట్ డివైసెస్ (FED): దేవరగట్టు బన్నీ ఉత్సవాలు మరియు రాబోయే ఎన్నికల దృష్ట్యా సిబ్బంది నిష్పక్షపాతంగా, అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు రాఘవేంద్ర, వెంకట్రామయ్య, వెంకటరమణ, ఉపేంద్ర బాబు, దుర్గాప్రసాద్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


