“మధ్యవర్థిత్యం 3.0 పై న్యాయ వాదుల తో మీడియేటర్స్ తో సమీక్ష”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆవరణలో మధ్యవర్తులకు మరియు న్యాయ వాదులకు మరియు ప్యారా లీగల్ వాలెంటీర్స్ కు బి. లీలా వెంకట శేషాద్రి , కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారు “మధ్యవర్తిత్వం 3.0” పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి “ మధ్యవర్తిత్వం – 3.0” కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను మధ్యవర్తులకు న్యాయ వాదులకు ప్యారా లీగల్ వాలంటీర్స్ కు వివరించారు. కక్షి దారుల మధ్య తలెత్తే వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా, మధ్యవర్తులు తమ నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించి, ఇరుపక్షాలకు మెరుగైన మరియు నిష్పక్షపాతమైన మధ్యవర్తిత్వ సేవలను అందించాలని కోరారు. అలాగే మధ్యవర్తిత్వం 3.0 లో భాగంగా ప్రతి గ్రామం లోను మీడియేషన్ పై విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని న్యాయవాదులకు ప్యారా లీగల్ వాలంటీర్లకు మీడియేటర్స్ కు తెలిపారు. కోర్ట్ లలో పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా న్యాయవాదులు త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులు తమ సహాయ సహకారులను అందించి ఈ మధ్యవర్తిత్వ 3.0 ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీడియేటర్స్ నిర్మల,బద్దల్ లక్ష్మి నారాయణ,అన్నపూర్ణ రెడ్డి, న్యాయవాదులు,ప్యారా లీగల్ వాలెంటీర్స్ పాల్గొన్నారు.


