NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొత్తపల్లి కేజీబీవీ ప్రిన్సిపాల్ సస్పెండ్

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా కొత్తపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణాబాయిని సస్పెండ్ చేసినట్లు కస్తూరిబా పాఠశాల జీసీడిఓ జ్యోతి తెలిపారు.కొత్తపల్లి మండలం పి లింగాపురం గ్రామానికి చెందినభవ్య(17)కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈనెల 23వ తేదీ తెల్లవారు జామున అమ్మాయి బాత్ రూములకు వాడే లిక్విడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ జి రాజకుమారి విచారణ చేపట్టారు.శుక్రవారం జూపాడుబంగ్లాలో గ్రీవెన్స్ లో కలెక్టర్ రాజకుమారికి మా అమ్మాయి మృతి సూసైడ్ రైటింగ్ నోట్ మా అమ్మాయిది కాదని కలెక్టర్ తో మొరపెట్టుకున్నారు.విద్యార్థిని ఘటన మృతిపై ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసినట్లు జీసీడిఓ జ్యోతి శనివారం సాయంత్రం తెలిపారు.

About Author