ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ అదనపు బాధ్యతలు
1 min read
మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించిన డిపిఓ మల్లికార్జునరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో మరియు జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.


