త్రీ-డీ ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ పరికరం ను ప్రారంభించిన మంత్రి టి.జి భరత్ గుప్త
1 min read
రాయలసీమ లోనే కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య లభిస్తున్నాయి
పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ గుప్త
కర్నూలు , న్యూస్ నేడు : కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రాయలసీమలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించడం జరుగుతున్నది రాష్ట్ర పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ గుప్త ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో త్రీ-డీ ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ పరికరం ను ప్రారంభించు సందర్భంగా పేర్కొన్నారు.శనివారం ఉదయం కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాలలో 28 లక్షల 50 వేల రూపాయల విలువైన త్రీడీ ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ పరికరమును పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్త ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ ప్రాంతీయ కంటి వైద్యశాలకు ప్రతిరోజు దాదాపు 400 మంది వైద్యం కొరకు వస్తారని తెలిపారు. రాయలసీమలోనే అత్యుత్తమ వైద్యుల సలహాలు , చికిత్స మరియు వైద్య సేవలు ప్రజలకు కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే లభిస్తున్నాయని తెలిపారు. ఈ పరికరం రాయలసీమలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రి లోనూ లేదని మంత్రి తెలిపారు. దీనితో ప్రజలు ఉచితంగా కంటి రెటీనా సమస్యలను సూక్ష్మ స్థాయి లో తెలుసుకోవచ్చని తెలిపారు.ఈ పరీక్ష బయట చేసుకుంటే దాదాపు 3 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని , ఈ పరీక్షతోపాటు 25 వేల రూపాయల విలువైన సూది మందులు ఉచితంగా ప్రజలకు లభిస్తాయని మంత్రి తెలిపారు.కావున ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రానికి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండడం వలన రాష్ట్ర ప్రజలకు ఏ అవసరాలు తీర్చాలి అన్న విషయాలు ముఖ్యమంత్రికి తెలియడం వలన ఇటువంటి మంచి ఉపకరణాలు కర్నూలు ఆసుపత్రికి తేవటం జరిగిందని మంత్రి తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యేగా మరియు రాష్ట్ర మంత్రిగా నా ధ్యేయం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దే ప్రయత్నాలను విడతల వారీగా చేస్తూ ఉన్నామని ఇంకా చేయవలసింది కూడా పూర్తి స్థాయి లో కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెన్డెంట్ డాక్టర్.ఎం.సత్యనారాయణ రెడ్డి ఈ పరికరము వలన ఉపయోగాలు మంత్రికి తెలియజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…వయస్సు పై బడ్డవారికి మరియు మధుమేహ రోగులకు కంటి రెటీనా సమస్యలను గుర్తించడానికి ఈ పరికరము చాలా ఉపయోగపడుతుందని తెలుపుతూ ప్రజలు ఈ పరికరము ద్వారా లభించే ఉచిత వైద్య సేవలను వినియోగించుకొని తమ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు.
కర్నూలు సర్వజన ఆస్పత్రి సూపరింటెన్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…గత రెండు సంవత్సరాల నుండి మంత్రి భరత్ గుప్త సర్వజన ఆసుపత్రికి కావలసిన అన్ని పరికరాలను మరియు రోగులకు అవసరమైన భవనాలు , వసతులు ఏర్పాటు చేయటానికి తీవ్రంగా కృషి చేస్తూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారని , ప్రజలు ఇక్కడ లభించే అన్ని ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపర్ఇంటెండెంట్ డాక్టర్.ఎం.సత్యనారాయణ రెడ్డి , జి.జి.హెచ్ సూపర్ఇంటెండెంట్ డాక్టర్.కె.వెంకటేశ్వర్లు , కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్.చిట్టి నరసమ్మ , స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సీ.ఎస్. కె.ప్రకాష్, కంటి ఆసుపత్రి హెచ్ ఓ డి యుగంధర్ రెడ్డి, డాక్టర్లు కే.ఎల్.ఎన్ రాజు, కిరణ్ కుమార్ , హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్ , సాయి ప్రదీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


