గర్భవతులు బాలింతలకు నియమాలు తప్పనిసరి
1 min read
టీడీపీ నాయకులు డాక్టర్ వనజ..
నందికొట్కూరు న్యూస్ నేడు: గర్భవతులు బాలింతలు తప్పనిసరిగా ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని టీడీపీ మహిళా నాయకులు డాక్టర్ డి వనజ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం సంగయ్య పేటలో 9 వ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మహోత్సవ కార్యక్రమంలో డాక్టర్ వనజ,బిసి సెల్ అధ్యక్షులు పి వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ ఈఎం సురేంద్ర హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భవతులకు బాలింతలకు బాల సంజీవని కిట్లను ప్రతిష్టాత్మకంగా అందిస్తోందని ఈ కిట్లలో ఉండే ప్రతి వస్తువును కూడా వాడితే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు.ప్రభుత్వ ఆదేశాల ఈ మాసోత్సవాలు అక్టోబర్ 8 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వీటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



