NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 ఓటర్ల జాబితాలో అవకతవకలు..

1 min read

–   ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దే బాధ్యత తీసుకోవాల్సిందే..

– ఆయన తన పదవికి రాజీనామ చేయాలి

– కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్

మదనపల్లె సెప్టెంబర్ 27, న్యూస్ నేడు ప్రతినిధి :ఓటర్ల జాబితాలో ఆవకతవకలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్  బాధ్యత తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పీలేరు నియోజక వర్గంలో మండల కేంద్రం గుర్రంకొండ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో వారు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని  పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో  140 కోట్ల మంది ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్ష వివాదాస్పద నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల కమిషన్ లో జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా తయారీలో ముఖ్యంగా ఓటర్ల చేర్పులు, మార్పు లు, తొలగింపులు, సవరణల్లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకొనె నిర్ణయాలు నిర్మాణాత్మకంగా, రాజ్యాంగ బద్ధంగా కాకుండా వ్యక్తిగత అభిప్రా యాల మేరకు అమలు చేయడం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయాల పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ లో మిగిలిన ఇద్దరు సభ్యులు లేవ నెత్తిన అభ్యంత రాలను కూడా పరిగణలోని తీసు కోకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. గడిచిన 10 నెలల కాలంలో 14 పర్యాయాలు త్రిసభ్య కమిటీలోని  ఇద్దరు ప్రతినిధులు రాతపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ వాటిని కూడా పక్కన పెట్టడం ఎన్నికల ఓటర్ల జాబితాలో అవకత వకలకు నిదర్శన మని నిప్పులు చెరిగారు. అయితే భారతదేశం లో ఎన్నికలు ప్రజా స్వామ్యానికి ఊపిరి పోస్తే, నేడు, ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ లో చోటు చేసు కున్న పరిణామా లకు బాధ్యత వహిస్తూ జ్ఞానేష్ కుమార్ గౌరవంగా  తప్పుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై ప్రజాస్వామ్య పద్ధతి లో కాంగ్రెస్ పార్టీ ఆయన అస్థానం నుంచి తప్పుకునే వరకు పోరాడ డానికి వెనుకాడ బోధని హెచ్చరిం చారు.   కార్య క్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నవాబ్ జాకీర్ హుస్సేన్, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కే భాష, కాంగ్రెస్ పార్టీ పీలేరు నియోజకవర్గం ఇంచార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ సమీరుద్దీన్, డిసిసి ఉపాధ్యక్షులు దుబ్బ శ్రీకాంత్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు మల్లిక, నాయకులు సయ్యద్, రెడ్డి బాషా,ఇస్మాయిల్ లు పాల్గొన్నారు.

About Author