సీఎం పర్యటనకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలి
1 min read
– జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె సెప్టెంబర్ 27, న్యూస్ నేడు ప్రతినిధి:అక్టోబర్ 2న మదనపల్లె కు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్య టనకు సంబంధించి న ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం మదన పల్లె చంద్రకాలనీ, బీకేపల్లి, వెన్నెల రెస్టారెంట్ వెనుక ప్రాంతాల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సీఎం పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాల ను మరోమారు పరిశీలించి తీసు కోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సభా ప్రాంగణంలో ప్రజలు, ప్రజా ప్రతి నిధులు, అధికారు లు, మీడియాకు అవసరమైన సదు పాయాలు కల్పించా లని సూచించారు. పార్కింగ్, బారికేడ్లు, విద్యుత్,తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, అప్ప గించిన బాధ్యతల ను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచిం చారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పను లను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రజల రాక పోకలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన బాబు, పీలేరు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



