NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీధి దీపాల సమస్యలకు పరిష్కారం చూపిన ఎస్‌డీపీఐ కార్యకర్తలు

1 min read

“మన వార్డు – మన బాధ్యత” నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడుగు

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద పట్టణంలోని 8, 9వ వార్డుల్లో చాలా కాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్న వీధి దీపాల సమస్యలను సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) కార్యకర్తలు పరిష్కరించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న ప్రాంతాల్లో పనిచేయని వీధి దీపాలను గుర్తించి, వాటికి మరమ్మతులు చేపట్టి వెలుగులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్‌డీపీఐ కార్యకర్తలు మాట్లాడుతూ “మన వార్డు – మన బాధ్యత” అనే నినాదంతో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సాధ్యమైన చోట తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో వార్డు ప్రజలు ఎస్‌డీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “మన వార్డు – మన బాధ్యత” కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, హోళగుందలోని ఇతర వార్డుల్లో కూడా ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్‌డీపీఐ కార్యకర్తలు తెలిపారు.

About Author