NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీ కేంద్రాలకే పిల్లల్ని పంపండి..

1 min read

ఆట పాటలతో విద్యాబోధన..

మిడుతూరు న్యూస్ నేడు: అంగన్ వాడీ కేంద్రాలకే పిల్లల్ని పంపించాలని ఎంపీడీవో పి దశరథ రామయ్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు నాలుగవ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ మాసోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు.అంగన్వాడీ ఉత్సవాలు ఈనెల 25 వ నుండి అక్టోబర్ 7 వరకు  ఉంటాయి ప్రతి అంగన్వాడి కేంద్రంలో 3 రోజులు నిర్వహించటం జరుగుతుంది అంగన్వాడి సూపర్వైజర్ రేణుకా దేవి అన్నారు.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం “మన అంగన్వాడి-మన బాధ్యత”లో భాగంగా చిన్నారుల పనులకు ఎంపీడీవో అవగాహన కల్పించారు.పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా అంగన్వాడీ స్కూల్ కి పంపిస్తే ఇక్కడ కూడా వాటితో పాటు సమానంగా ఆటపాటల ద్వారా విద్యాబోధన చెప్పడం జరుగుతూ ఉందని ఎంపిడిఓ అన్నారు. ఇక్కడ పీపీ1,పీపీ 2 బుక్స్ ద్వారా ఇంగ్లీష్ మీడియం బోధిస్తారని ప్రభుత్వం తల్లులకు ఇచ్చే పోషకాహారం మంచిగా సద్వినియోగం చేసుకోవాలని పోషక  విలువలతో ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని టీడీపీ మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో  ఎంఎల్ హెచ్పి ,ల్,అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

About Author