పొలాల్లో మందులు వేసుకోవద్దు..
1 min read
పల్లెల్లో ప్రజలకు ఎల్ నినో అవగాహన
జిల్లా స్పెషల్ ఆఫీసర్ జేడి వెంకటరమణ..
మిడుతూరు న్యూస్ నేడు: ప్రస్తుత ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడంతో ఎల్ నినో గురించి జిల్లా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోనిమాసపేట,కడుమూరు, మిడుతూరు,వీపనగండ్ల, నందికొట్కూరు మండలం నాగటూరు,బిజినవేముల, జూపాడుబంగ్లా మండలం తర్తూరు,మండ్లెం గ్రామాల్లో సోమవారం గ్రామాల రైతులకు జిల్లా స్పెషల్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ డాక్టర్ పి వెంకటరమణ,నంద్యాల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మంజునాథ్,ఏ డిఏ గిరీష్,ఏడి ఆనిమల్ హస్బెండరీ డాక్టర్ డి వరప్రసాద్,రామాంజనేయ నాయక్,శాస్త్రవేత్తలు డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి,సతీష్ బాబు రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితి దృష్ట్యా తేమకే అధిక మోతాదులో మందులు వేసుకోవద్దు వేసుకున్నట్లయితే ఎండ తీవ్రతకు పంటలు బెట్ట ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆరుతడి పంట కుసుమ,జొన్న మొదలైన పంటలు వేసుకోవచ్చన్నారు.అదేవిధంగా పంట పొలాలను సందర్శించి రైతులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంఏఓలు పీరు నాయక్,షేక్షావలి, కృష్ణారెడ్డి,రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.



