NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జైలులో ఎమ్మెల్యే బూసినే విరుపాక్షికి వైఎస్సార్సీపీ నాయకుల ములాఖత్

1 min read

సంఘీభావం తెలిపి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు

ప్రజల కోసం పోరాడే నాయకుడిగా మరింత ధైర్యంగా తిరిగి ప్రజల మధ్యకు వస్తారు: వైఎస్సార్సీపీ నాయకులు

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షిని సోమవారం పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ములాఖత్ అయ్యారు. గుంతకల్ మాజీ శాసనసభ్యులు వై. వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పులివెందుల ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే. గిరి కలిసి ఎమ్మెల్యే బూసినే విరుపాక్షిని పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూసినే విరుపాక్షికి వారు తమ సంఘీభావాన్ని తెలియజేసి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడిగా ఆయన మరింత ధైర్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీర్వాదాలతో త్వరలోనే తిరిగి ప్రజల మధ్యకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులపై పరస్పరం చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలూరు తాలూకా సోషల్ మీడియా అధ్యక్షులు కురువ మౌనేష్, హోళగుంద మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంభులింగ తదితరులు పాల్గొన్నారు.

About Author