NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా గుర్రం జాషువా 131వ జయంతి 

1 min read

న్యూస్ నేడు పత్తికొండ :  పత్తికొండ స్థానిక శాంతి టాలెంట్ హై స్కూల్లో అభ్యుదయ రచయితల సంఘం(అరసం )జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ అధ్యక్షతన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, వక్తలుగా రచయిత ,ప్రముఖ సాహితీ విమర్శకులు మరియు విశ్లేషకులు డాక్టర్ కే నాగేశ్వర చారి మరియు అరసం జిల్లా గౌరవ సలహాదారుడు డాక్టర్ లక్ష్మణస్వామి హాజరయ్యారు. మొదట గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర చారి మాట్లాడుతూ జాషువా ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించి సమానత్వం కోసం తన కవిత్వం ద్వారా ఈ సమాజాన్ని మేల్కొల్పిన అభ్యుదయ కవి గుర్రం జాషువా అని తెలియజేశారు .కుల వివక్ష ,అంటరానితనం, పేదరికం ,సామాజిక అసమానతలు, మతం మూఢనమ్మకాలపై తల కలాన్ని ఆయుధంగా మలచిన సామాజిక చైతన్య కవిజాషువా అన్నారు . అరసం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జాషువా కలం మనిషి ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం ,మనుషులలో మానవత్వం కోసం ,తెలుగు సమాజంలో తన కవిత్వం ద్వారా సాహిత్య పోరాటం చేసిన మహాకవి ఆయన అన్నారు. అరసం జిల్లా గౌరవ సలహాదారుడు డాక్టర్ లక్ష్మణస్వామి గుర్రం జాషువాని గురించి మాట్లాడుతూ జాషువా తన జీవితంలో కుల వివక్షతను ఎలా అనుభవించారో వివరించారు .అందుకే ఆయన కవిత్వంలో తన జీవితంలో అనుభవించిన ఆవేదనను ,ఆవేశాన్ని, ప్రశ్నించే తత్వాన్ని ఆయన కవిత్వంలో కనిపిస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విజేతలకు జాషువా, శ్రీ శ్రీ కవిత్వానికి సంబంధించిన పుస్తకాలను బహుమతిగా అందజేశారు .ఈ కార్యక్రమములో పాఠశాల హెడ్మాస్టర్ విజయలక్ష్మి తో పాటు ఉపాధ్యాయులు నాగరాజు, రహమతుల్లా, హమీద్ , మక్తుం ,విక్రమ్  తదితరులు పాల్గొన్నారు.

About Author