NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓట్ల తొలగింపుపై సీఈసీ రాజీనామా చేయాలి 

1 min read

భగత్‌సింగ్ ఆశయాల సాధనకు కృషి చేస్తాం సీపీఎం, సీఐటీయూ నాయకులు

న్యూస్ నేడు, పత్తికొండ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీగా ఓటర్ల పేర్లు తొలగించడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం పత్తికొండ పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. స్థానిక కామ్రేడ్ ఈశ్వర్‌రెడ్డి భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ నాలుగు స్తంభాల మండపం వరకు సాగింది. అక్కడ సీపీఎం, సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టి ఎన్నికల సంఘం తీరుపై నిరసన వ్యక్తం చేశారు.అనంతరం నాలుగు స్తంభాల మండపం వద్ద సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్‌సింగ్ దేశ స్వాతంత్ర్యం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని వారు గుర్తు చేసుకున్నారు. సిపిఎం సీనియర్ నాయకులు రంగారెడ్డి,సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర మాట్లాడుతూ.. భగత్‌సింగ్ ఆశయాలు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో అసమానతలు తొలగించి, కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం పోరాడటమే భగత్‌సింగ్‌కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భగత్‌సింగ్ ఆశయాలను సాధించే వరకు ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అనంతరం ఓటర్ల జాబితాలపై మాట్లాడుతూ.. SIR ప్రక్రియలో భారీగా ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉందని, ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలని కోరారు.కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ తదితరులు పాల్గొన్నారు.

About Author