NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలి మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎస్‌ఎంసీ ఎన్నికలు

1 min read

64 ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా ఎన్నికలు

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని 64 ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర నాయిక్ తెలిపారు.ఎన్నికల నిర్వహణకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎన్నికలు సజావుగా సాగేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author