NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, ఏపీ గురుకుల పాఠశాలల  విద్యా కమిటీలు ఏకగ్రీవం

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ : పత్తికొండ పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా లత, గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా ఎం.దేవరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం ఎమ్మెల్యే కేఈ.శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు,టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్‌నాథ్ ఆధ్వర్యంలో విద్యా కమిటీ చైర్మన్ల ఎన్నికలో పాల్గొన్ని.ఈ సందర్భంగా టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా చైర్మన్ పదవులకు ఎంపికకు కృషి చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు టీడీపీ నాయకులు,కార్యకర్తలు అభినందనలు తెలిపారు.ఆనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్ లు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి,విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లు వైస్ చైర్మన్ రాములమ్మ, పద్మావతి.మాదాసి మాదారి కురవ ఎస్సీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కేపీ.బ్రహ్మయ్య,పత్తికొండ టిడిపి నాయకులు పల్లె పవన్.టిడిపి నాయకులు రమేషు,కే పి,రమేష్.చిన్న.రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author