ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్‌గా కుద్లూర్ నజీర్
1 min read
వైస్ చైర్మన్‌గా ఎం. ఇస్మాయిల్ ఎన్నిక.. 13 మంది సభ్యులతో నూతన ఎస్ఎంసీ కమిటీ
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాలలో 2026–2028 విద్యా కాలానికి సంబంధించి పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కుద్లూర్ నజీర్‌ను ఎస్ఎంసీ చైర్మన్‌గా, ఎం. ఇస్మాయిల్‌ను వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మొత్తం 13 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసీ కమిటీ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా నూతన ఎస్ఎంసీ చైర్మన్ కుద్లూర్ నజీర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధి తన ప్రధాన ప్రాధాన్యతలని తెలిపారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.నూతనంగా ఎన్నికైన చైర్మన్ కుద్లూర్ నజీర్, వైస్ చైర్మన్ ఎం. ఇస్మాయిల్, 13 మంది కమిటీ సభ్యులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు.



