సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఒరేయ్ రాముడూ లఘుచిత్రం
1 min read
ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని వక్తలు పిలుపు
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఒరేయ్ రాముడూ లఘుచిత్రాన్ని మదనపల్లె రచయితల సంఘం ఆధ్వర్యంలో విడుదల చేశారు. డిఏన్ భూషణ్ టీవీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ లఘు చిత్రాన్ని మంగళవారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ అన్న మయ్య జిల్లా అధ్యక్షులు డా. ఎన్ ముని గోపాల కృష్ణ, సినీ నిర్మాత, ఏబిసి సేవా సంస్థ అధ్యక్షులు డా. అప్పినపల్లి భాస్కరాచారి లు ముఖ్య అతి థులుగా హాజరై విడుదల చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగు తున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ఒరేయ్ రాముడూ సందేశాత్మక లఘు చిత్రం ద్వారా సైబర్ నేరగాళ్లు అనుస రిస్తున్న వివిధ మోసపూరిత పద్ధతులు, అను మానాస్పద ఫోన్ కాల్స్, నకిలీ సందే శాలు, మోసపూరిత లింకులపై ప్రజలను చైతన్య పరిచేలా రూపొందించారని కొనియాడారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకుల విషయం లో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తి గత, బ్యాంకింగ్, ఆర్థిక సమాచా రాన్ని ఇతరులతో పంచుకో కూడదనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుందని తెలిపారు. మరసం అధ్యక్షులు పి.వి. ప్రసాద్, ఉపాధ్య క్షులు నాగభూషణం రావు, ఆచార్య డా. కె. మంజు ప్రీతం లు మాట్లాడుతూ ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ లఘు చిత్రాన్ని రూపొందిం చినట్లు తెలిపారు. సైబర్ నేర గాళ్ళు ఉన్నారూ జాగ్రత్త రా అంటూ సమా జాన్ని అప్రమత్తం చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు.ఈ కార్యక్రమంలో మరసం ప్రధాన కార్యదర్శి లింగాల యుగంధరాచారి, రాంమోహన్ నాయుడు, ఆచార్య మంజు ప్రీతమ్, రమేష్, విద్వాన్ ప్రసాద్ శర్మ లు పాల్గోన్నారు.


