NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హార్స్లీ హిల్స్‌లో   ఉత్సాహంగా కరాటే క్రీడా సంబరాలు

1 min read

ట్రెక్కింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ లో పాల్గొన్న విద్యార్థులు

బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ఏపీ టూరిజం అధికారులు

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : ఆంధ్ర ఊటి హార్స్లీ హిల్స్‌ నందు “లీ”మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కరాటే విద్యార్థులు తమ ప్రతిభతో సందడి చేశారు. అకాడమీ వ్యవస్థాపకులు, కరాటే మాస్టర్ మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం నందు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ట్రెక్కింగ్, స్విమ్మింగ్, రన్నింగ్‌తో పాటు పలు రకాల క్రీడా పోటీలు నిర్వ హించారు. కరాటే శిక్షణతో పాటు ప్రకృతి ఒడిలో నిర్వహించిన ఈ పోటీలతో చిన్నారు ల్లో శారీరక దృఢత్వం, మాన సిక ఉల్లాసం, ఆత్మ విశ్వాసం, క్రమ శిక్షణను పెంపొందించాయి.అనంతరం విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా విచ్చేసిన ఏపీ టూరిజం మేనేజర్ శ్రీధర్, సూపర్వైజర్ రవి పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు. బెల్ట్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థు లకు బెల్టులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.కరాటే విద్యార్థుల ప్రదర్శనలు, క్రీడా నైపుణ్యాలు  పర్యాటకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభను చూసిన ఏపీ టూరిజం సిబ్బంది, తల్లి దండ్రులు, పర్యా టకులు వారిని అభినందించారు.విద్యార్థులకు కరాటే శిక్షణతో పాటు క్రీడలు, ప్రకృతి తో మమేకం కావడం ద్వారా వారిలో సంపూర్ణ వికాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహించామని మాస్టర్ మురళి తెలిపారు.

About Author