పుణ్యకథా శ్రవణమే భక్తి…
1 min read
డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు.
కౌలూరులో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: పుణ్యకథలను శ్రద్ధగా వినడం వల్ల మనస్సులో భగవంతునిపై భక్తి, విశ్వాసాలు పెరుగుతాయని, ధర్మం పట్ల అవగాహన ఏర్పడుతుందని ప్రముఖ సంస్కృత పండితులు, వ్యాఖ్యాత, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు అన్నారు. పుణ్యకథలు కేవలం వినోదం కోసం చెప్పుకునే కథలు కాదని, వాటిలో మానవ జీవితానికి అవసరమైన విలువలు, ధర్మబోధలు, నీతి సూత్రాలు, సత్ప్రవర్తనకు సంబంధించిన సందేశాలు అంతర్లీనంగా ఉంటాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో పాణ్యం మండలం, కౌలూరు గ్రామంలోని శ్రీ సిద్దేశ్వరస్వామి భజన మందిరంనందు ధార్మిక కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా మొదటిరోజు శ్రీమద్రామాయణంపై ప్రవచనం జరిగినది.తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమం జరిగినది. తితిదే హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కుటుంబ విలువలు, నైతికత, మానవీయ సంబంధాలు, ఆధ్యాత్మిక చింతన మరింత బలపడాల్సిన అవసరం ఉందని, అందుకు పుణ్యకథా శ్రవణం, సత్సంగాలు, భజనలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి పరమేశ్వరమ్మ, శ్రీదేవి, సులోచన, నారాయణరెడ్డి, హేమంతరెడ్డి, సుధా, రాములమ్మ, ఉషేన్బీ, ప్రభావతమ్మ, రమణమ్మతో పాటు భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.


