NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయస్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: అక్టోబర్ మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జైపూర్ లో జరగబోయే 51వ జాతీయస్థాయి సబ్ జూనియర్ యోగాసన పోటీలకు జిల్లా క్రీడాకారులు చేతన్ చక్రవర్తి, మహమ్మద్ అషాజ్,రాజేష్,సుదర్శన్, శశికాంత్,హరిప్రియ, నితాలి జైన్ లు ఎంపికైనట్లు జిల్లా అధ్యక్షుడు అవినాష్ శెట్టి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు లు హాజరై క్రీడాకారులకు ట్రాక్ సూట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచి కర్నూలు సత్తా చాటాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని విజేతలుగా తిరిగి వస్తే నగదు పురస్కారాన్ని అందిస్తానని లక్ష్మీకాంత్ రెడ్డి ప్రకటించారు.ఈ  కార్యక్రమంలో జిల్లా యోగా సంఘం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, సెక్రెటరీ మునిస్వామి,అభిరామ్ లు పాల్గొన్నారు.

About Author