NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్​డబ్ల్యుపిసి షెడ్‌లో హరిత రాయబారులకు ప్రత్యేక శిక్షణ

1 min read

వర్మీ తయారీ, బిన్–బ్యాగ్ విధానంపై అవగాహన

హరిత రాయబారులకు సన్మానం.. వైద్య పరీక్షలు నిర్వహణ

హోళగుంద న్యూస్ నేడు: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ అభివృద్ధి అధికారులు, హరిత రాయబారులతో కలిసి హోళగుంద గ్రామ పంచాయతీలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం (SWPC)లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తడి చెత్తను వినియోగించి వర్మీ తయారు చేసే విధానంపై హరిత రాయబారులకు శిక్షణ అందించారు. అలాగే ప్రతి ఇంటిలో బిన్–బ్యాగ్ విధానాన్ని అమలు చేయడం, తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై వివరించారు.ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ ఉమర్ మాట్లాడుతూ ప్రతి హరిత రాయబారి రోజువారీగా కనీసం 100 కిలోల తడి చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒక్క టన్ను వర్మీ ఎరువును తయారు చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని తెలిపారు. ప్రతి ఇంటిలో బిన్–బ్యాగ్ విధానాన్ని అమలు చేయడంతో పాటు, తడి మరియు పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడుతూ ఆరోగ్యంగా ఉండాలని వైద్యాధికారి బిందు మాధవి హరిత రాయబారులకు సూచించారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన వైద్యం పొందాలని తెలిపారు.కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన హరిత రాయబారులను సన్మానించారు. అనంతరం వారికి నాలుగు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిరక్షణ, చెత్త సేకరణ, పర్యావరణ పరిరక్షణలో హరిత రాయబారుల సేవలను అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సయ్యద్ ఉమర్, వైద్యాధికారి బిందు మాధవి, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ అభివృద్ధి అధికారులు, హరిత రాయబారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *