అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలి
1 min read
ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి
మిడుతూరు న్యూస్ నేడు: అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పోషకాహార సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి మరియు మిడుతూరు మండల టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి కమతం రాజశేఖర్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అంగన్వాడి సూపర్వైజర్ రేణుకా దేవి ఆధ్వర్యంలో మాసోత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు, కడుమూరు క్లస్టర్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారులకు మంచి పోషకాహారం ఇస్తుందన్నారు. గర్భవతులు బాలింతలు చిన్నారులు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ప్రతి వస్తువును కూడా ఉపయోగించుకోవాలని ప్రజలకు అందిస్తున్న సేవల గురించి కమతం రాజశేఖర్ రెడ్డి వివరించారు. మహిళల్లో పౌష్టికాహారం,ఆరోగ్యం, పరిశుభ్రత,టీకాలు,శిశు అభివృద్ధి మరియు పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన’పోషణతో ఆరోగ్యం- ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు’అనే సందేశంతో ప్రతి కుటుంబం పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అక్టోబర్ 7 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని సూపర్వైజర్ తెలిపారు. తర్వాత ప్రజలకు మంచిగా సేవలు అందిస్తున్న అంగన్వాడి కార్యకర్తలు వనజ,భాగ్యమ్మ,నూర్జహాన్ బీ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నాగేంద్ర,మహబూబ్ బాష నాయకులు కమతం వీరారెడ్డి,కే మహేశ్వర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి,వెంకటరెడ్డి పాల్గొన్నారు.


