NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్యాస్ డెలివరీ ధరలపై వినియోగదారులకు అవగాహన – ఆర్డీవో అరుణదేవి

1 min read

కౌతాళం, న్యూస్ నేడు: కౌతాళం మండలంలోని గ్యాస్ గోడౌన్ ను ఆదోని డివిజన్ ఆర్డీవో అరుణ దేవి బుధవారం తనిఖీ చేశారు. తహసీల్దార్, సీఎస్ డీటీ, డీఐవో లతో కలిసి గ్యాస్ నిల్వలు, సరఫరా విధానాన్ని పరిశీలించారు.దీపం పథకం లబ్ధిదారులతో మాట్లాడిన ఆర్డీవో, గ్యాస్ డెలివరీ ధరలు, అదనపు ఛార్జీలపై అవగాహన కల్పించారు. నిర్ణయించిన ధరలకు మించి అదనంగా వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. , ఎరిగేరి ,కౌతాళం గ్రామాల్లో లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కౌతాళం గ్రామంలో ఫేజ్-6 లో జరుగుతున్న రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకాంత్ రెడ్డి ఆర్ఐ వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *