రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తాను చాటేలా పనిచేయాలి
1 min read
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతి నిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గం సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశానికి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, కూటమి సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, విజయావకాశాలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తాను చాటేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమిలో చిన్నచిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉండటం సహజమేనని, అయితే ఎన్నికల సమయంలో వాటిని పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.కూటమి తరఫున గెలుపొందే అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఆయన విజయమే లక్ష్యంగా కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాల కంటే కూటమి ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమని స్పష్టం చేశారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు అందించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకుమించిన ఫలితాలు సాధించే దిశగా పనిచేయాలని పార్టీ నాయకత్వం ఆశిస్తోందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి,జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, ఆకుల అరుణకుమారి, బొప్పన సుధాకర్, కవల కోదండ రాంబాబు, పల్లెం ఏడుకొండలు,జంపా సూర్యనారాయణ, ఉప్పలపాటి శ్రీరామ్ ప్రసాద్, బొబ్బర రాజ్ పౌలకుమార్,గుడిపూడి రేవతి, జారం చాందిని, పూజారి నిరంజన్, పులవర్తి శామ్యూల్, దేవరపల్లి ఆదాం, చెరువుగట్టు రామ్మోహనరావు, గుమ్మళ్ళ నాగార్జున,చింతాటి జ్యోతి, తలపంటి వెంకట రాజశేఖర్, తానాంకి సురేష్, మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వర ప్రసాదరావు కంప్యూటర్ (ప్రసాద్) మరియు తదితరులు పాల్గొన్నారు.



