NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్టీసీ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి… జిల్లా కలెక్టర్

1 min read

స్థానిక ఆర్టీసీ  బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి ప్రయాణీకులకు  అందుతున్న త్రాగునీరు,టాయిలెట్లు వంటి ప్రాథమిక  సౌకర్యాలు తనిఖీ

ప్రయాణీకులతో మాట్లాడి  సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆర్టీసీ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్టీసీ  బస్టాండ్ ను బుధవారం ఆకస్మికంగా సందర్శించి ప్రయాణీకులకు  అందుతున్న త్రాగునీరు, టాయిలెట్లు వంటి ప్రాథమిక  సౌకర్యాలు తనిఖీ చేశారు. అనంతరం ప్రయాణీకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులతో ఆర్టీసీ  సిబ్బంది ప్రవర్తన, మర్యాదగా మాట్లాడుతున్నారా లేదా, బస్సుల సమాచారం సక్రమంగా అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ   ఏలూరు జిల్లాలో ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలలో  ప్రధానమైన బస్టాండ్ లు ఉన్నాయని, ఆర్టీసీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐవిఆర్ఎస్ విధానం ద్వారా తెలుసుకుంటున్నదన్నారు.  ఆ ప్రజాభిప్రాయంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ లో టాయిలెట్లపై ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేసారని, వాటిని పరిశీలించేందుకు, ప్రయాణీకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీ చేశానన్నారు.  బస్టాండ్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లు శుభ్రం చేయాలన్నారు. ప్రయాణీకులతో ఆర్టీసీ సిబ్బంది మర్యాదగా మాట్లాడుతూ సేవలందించాలన్నారు.  గృహ హింస, పోక్సో, మాదకద్రవ్యాల వినియోగం నియంత్రణ, నిర్మూలనపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటుచేయటమైనది, సదరు నంబర్లను ప్రతీ బస్టాండ్, బస్సులో ప్రజలకు తెలిసేలా ప్రదర్శించాలన్నారు.  ఈ సందర్భంగా  రెడ్డి గణపవరం నకు బస్సు సర్వీసులు తక్కువగా ఉన్నాయని, సర్వీసులు ఏర్పాటుచేయాలని ప్రజలు కలెక్టర్ ని కోరారు.కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణ, ఆర్టీసీ ప్రాంతీయ అధికారి షబ్నమ్, ఆర్టీసీ అసిస్టెంట్  మేనేజెర్ కె. వరలక్ష్మి, తహసీల్దార్ స్లీవ్ జోజి, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *